Sabarimala:కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. వేలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. విపరీతమైన రద్దీ కొనసాగుతున్నది. మరోవైపు ఈ నెల 14న మకర సంక్రాంతి సందర్బంగా ఆలయంలో మకర దర్శనం (జ్యోతి దర్శనం) కారణంగా 13, 14 తేదీల్లో పంబ నుంచి ఆలయ పరిసరాల వరకూ భక్తజన సందోహం నెలకొంటుంది.
Sabarimala:భక్తుల రద్దీ కారణంగా అయ్యప్ప దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నది. ఆలయం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూలైన్లు ఉన్నాయి. ఈ రద్దీ కారణంగా 4,000 మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పిస్తున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్ దర్శనాలను కుదించారు. ఆదివారం 50 వేల మందికి, సోమవారం మరో 40 వేల మంది దర్శనానికి అనుమతించారు.
Sabarimala:ఈ నెల 15న 60 వేల మందికి ఆన్‌లైన్ దర్శన సదుపాయం కల్పించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నాకొద్దీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం తగిన ఏర్పాట్లను చేస్తున్నది. మకర దర్శనం ఎఫెక్ట్‌తో భక్తుల రద్దీ పెరిగింది.