Nani - Venky Atluri: 

Nani – Venky Atluri: సుజీత్ ‘OG 2’ మొదలుపెడితే వెంకీ అట్లూరి సినిమానే ముందు!

Nani – Venky Atluri: న్యాచురల్ స్టార్ నాని క్రేజీ లైనప్‌పై టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శకులు సుజీత్ మరియు వెంకీ అట్లూరి ప్రాజెక్టుల టైమింగ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఒకవేళ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం డైరెక్టర్ సుజీత్ తన #BloodyRomeo చిత్రాన్ని పట్టాలెక్కిస్తే గనుక.. నాని – వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మించబోయే సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది.

కానీ, అలా కాకుండా సుజీత్ గనుక ‘బ్లడీ రోమియో’ కంటే ముందే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ #OG2 పనులను మొదలుపెట్టి దానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం.. సీన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. ఆ గ్యాప్‌లో నాని – వెంకీ అట్లూరి సినిమా ‘బ్లడీ రోమియో’ కంటే ముందే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, సుజీత్ తీసుకునే నిర్ణయంపైనే ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ ఆధారపడి ఉన్నాయి. నాని లైనప్ చూస్తుంటే మాత్రం ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఖాయమనిపిస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *