sukumar

Sukumar: చరిత్ర సృష్టించిన సుకుమార్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Sukumar: ‘ఆర్య’ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సుకుమార్ ‘పుష్ప-2’తో జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించాడు. తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ తోనే ఇది అతనికి సాధ్యం కావడం మరో విశేషం. రెండో చిత్రం ‘జగడం’ ఫెయిల్ అయినా… ‘ఆర్య-2’తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నేపథ్యంలో ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘హండ్రెడ్ పర్శంట్ లవ్’ చక్కని విజయాన్ని అందుకుంది. మహేశ్ తో చేసిన ‘వన్ – నేనొక్కడినే’ బ్రిలియంట్ డైరెక్టర్ అనే పేరు తెచ్చిపెట్టింది కానీ కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప-2’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు సుకుమార్. ఇక తాజా చిత్రం ‘పుష్ప-2’ అయితే… వరల్డ్ వైడ్ 1800 కోట్లకు పైగా గ్రాస్ ను అతి తక్కువ రోజుల్లో వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. ఇది తన 9వ చిత్రంతోనే సుకుమార్ సాధించాడు. ప్రస్తుతం సుక్కు… రామ్ చరణ్‌ హీరోగా ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ‘పుష్ప-3’ తెరకెక్కుతుంది. జనవరి 11తో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్న సుకుమార్ కు ప్రముఖ నిర్మాణ సంస్థలు బర్త్ డే విషెస్ తెలిపాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pottel: పాన్ ఇండియాను తలపించేలా 'పొట్టేల్'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *