Cyclone:నైరుతి రుతుపవనాల రాక సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు తుపాన్ ప్రభావం ఏర్పడనున్నది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు, జూన్‌లో కేరళను తాకే అవకాశం ఉన్నది. అదే నెల మొదటి, రెండో వారాల్లో తెలుగు రాష్ట్రాలకు రానున్నాయి. దీనికంటే ముందే తుపాన్ దూసుకొచ్చే అవకాశం ఉన్నది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వారంపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.
Cyclone:ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతోపాటు శ్రీలంక దక్షిణ ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా విస్తరించి ఉన్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే ఇవి బంగాళా ఖాతంలో ఆవరించనున్నాయి.
Cyclone:బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ఆవర్తనం ఏర్పడి ఉన్నది. ఇది కొస్తాంధ్రకు సమీపంలోనే ఉన్నది. దీని వల్ల సముద్రమట్టం నుంచి కిలోమీటరున్నర ఎత్తులో మేఘాలు, గాలులు వీస్తున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుపాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుపాన్‌కు శక్తి అని పేరు పెట్టారు. ఇది రెండు వారాలపాటూ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
Cyclone:శక్తి తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపారు. అదే విధంగా పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఈదురుగాలుల వేగం అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

