Cyclone Montha Effect: మొంథా తుఫాన్ నష్టం అంతా ఇంతా కాదు. ఒక్కరోజే భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున కోత దశకు వచ్చిన అన్ని రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రైతులు నష్టపోయారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 179 మండలాల్లో పంటలకు తీవ్ర నష్టంవాటిల్లినట్టు తేలింది.
Cyclone Montha Effect: రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షల 82 వేల 379 ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగినట్టు తేలింది. 1 లక్షా 51 వేల 707 ఎకరాలలో పత్తి పంట దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో ఎక్కువగా అన్నిరకాల పంటలకు నష్టం జరిగిందని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.
Cyclone Montha Effect: ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 1,30,200 ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాల్లో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటితో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా 2.53 లక్షల మంది రైతులు ఆయా పంటలు కోల్పోయి నష్టపోయారని తేలింది.


