Crime News:

Crime News: పిల్ల‌లు క‌ల‌గ‌డం లేద‌ని భార్య‌ను ఏం చేశాడో చూడండి? జ‌గిత్యాల జిల్లాలో దారుణం

Crime News:ఇది మ‌రో దారుణం.. క‌ట్నం కోసం వేధించి, సాధించిన భ‌ర్త‌లు ఎంద‌రో మ‌హిళ‌ల‌ను హ‌త‌మార్చి ఊచ‌లు లెక్కించిన కేసులు చూశాం. ప‌రాయి మ‌హిళ‌తో వివాహేత‌ర బంధం పెట్టుకొని, భార్యే మ‌రో వ్య‌క్తితో ఆ బంధం కొన‌సాగిస్తుంద‌న్న కార‌ణాల‌తో క‌ట్టుకున్న భార్య‌ను క‌డ‌తేర్చిన వైనం మ‌నం త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం.

Crime News:పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని భార్య‌కు నిత్యం వేధింపులు చూశాం కానీ, ఏకంగా భార్య‌ను క‌డ‌తేర్చిన భ‌ర్త ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వచ్చింది. వారంరోజుల‌కు పైగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది ఈ ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. జ‌గిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

Crime News:జ‌గిత్యాల జిల్లా కొడిమ్యాల మండ‌లానికి చెందిన మ‌హేంద‌ర్‌, మ‌మ‌త భార్యాభ‌ర్త‌లు. ఈ దంప‌తుల‌కు పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. దానికి మ‌మ‌తే కార‌ణ‌మ‌ని నిత్యం భ‌ర్త మ‌హేంద‌ర్ వేధించేవాడు. దానికితోడు అత్తామామ‌లు, ఇత‌ర కుటుంబ స‌భ్యులు సూటిపోటి మాట‌ల‌తో త‌ర‌చూ వేధింపుల‌కు గురిచేసేవారు. దీనికితోడు వ‌ర‌క‌ట్నం వేధింపులు కూడా నిత్య‌కృత్య‌మ‌య్యాయి.

Crime News:గ‌త నెల మ‌మ‌త‌ను ఆమె భ‌ర్త మ‌హేంద‌ర్ త‌న‌ ఇంటికి తీసుకెళ్లాడు. బ‌ల‌వంతంగా ఉరిపోసి ఆమెను హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత ఏమీ ఎరుగ‌న‌ట్టే త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కొన్నాళ్ల‌కు మ‌హేంద‌ర్ ఇంటి నుంచే దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు పోలీసుల‌కు ఉప్పందించారు. పోలీసులు మ‌హేంద‌ర్ ఇంటిని ప‌రిశీలించ‌గా, కుళ్లిన స్థితిలో మ‌మ‌త మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. ఈ మేర‌కు కొడిమ్యాల‌ పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *