Crime News:

Crime News: హైద‌రాబాద్‌లో దారుణం.. వాచ్‌మ‌న్‌ను హ‌త్య చేసిన గంజాయి బ్యాచ్‌

Crime News:హైద‌రాబాద్ న‌గ‌రంలో దారుణాలు నిత్య‌కృత్య‌మ‌వుతున్నాయి. డ్ర‌గ్స్‌, గంజాయి మితిమీరి వాడుతున్న‌ట్టు న‌మోద‌వుతున్న కేసులే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. వాటి సేవ‌నంతో గ‌ల్లీల నుంచి న‌డి రోడ్ల వ‌ర‌కు దారుణ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇక్క‌డా అదే జ‌రిగింది. న్యూసెన్స్ చేయొద్ద‌న్నందుకే ఓ వాచ్‌మెన్‌ను గంజాయి బ్యాచ్ దారుణంగా హ‌త్య చేసింది.

Crime News:హైద‌రాబాద్ కేపీహెచ్‌బీ స‌ర్దార్ ప‌టేల్ న‌గ‌ర్‌లోని ఒక పార్కులో అర్ధ‌రాత్రి గంజాయి సేవిస్తూ ఓ అల్ల‌రి మూక న్యూసెన్స్ చేస్తున్న‌ది. కేక‌లు పెడుతూ పాట‌లు పాడుతూ అక్క‌డి అపార్ట్‌మెంట్ వాసుల‌కు నిద్ర‌ను క‌రువు చేశారు. ఎంత‌కూ ఆ గంజాయి గ్యాంగ్ న్యూసెన్స్ తగ్గ‌క‌పోవ‌డంతో స‌మీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంక‌ట‌ర‌మ‌ణ కొంద‌రితో క‌లిసి ఆ గంజాయి బ్యాచ్‌ను వారించ‌బోయాడు.

Crime News:ఆ వాచ్‌మెన్ వారించ‌డంతో ఆ గంజాయి గ్యాంగ్‌కు కోపం చిర్రెత్తుకొచ్చింది. ఊగిపోయారు.. మ‌మ్మ‌ల్నే అంటావా? అంటూ ఆగ్ర‌హంతో ఆ వెంక‌ట‌ర‌మ‌ణ గుండెల్లో ఇనుప‌రాడ్డుతో దారుణంగా పొడిచి హ‌త్య చేశారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ద‌శ‌లో వారిలో న‌లుగురిని అదుపులోకి తీసుకోగా, ప్ర‌ధాన నిందితుడు ప‌వ‌న్ ప‌రారీలో ఉన్న‌ట్టు తెలిసింది.

Crime News:చూశారా? న‌గ‌రంలో ఎవ‌రు ఎలా ఉంటారో? ఎవ‌రు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో? ఎప్పుడు ఏం జ‌రుగుతుందో? తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంటుంది అన‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. అర్ధ‌రాత్రి అల్ల‌రి చేయొద్ద‌న్నందుకే ఓ నిండుప్రాణాన్ని ఆ దుండ‌గులు బ‌లితీసుకున్నారు. ఇలాంటి న్యూసెన్స్ చేసే వారి ప‌ట్ల పోలీసులు నిఘా ఉంచాల‌ని ప‌లువురు న‌గ‌ర‌వాసులు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *