Crime News:శ్రీగంధం చెట్లు లాభదాయకమైన, దీర్ఘకాలికమైన పంట. 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వాటి దిగుబడి వస్తుంది. ఈ చెట్ల నుంచి సబ్సులు, ఔషధాలు, అత్తరుల తయారీకి ఉపయోగిస్తారు. మరి ఇంతటి చెట్లకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసా? ఒక్కో చెట్టు విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన చెట్లపై దొంగల కన్ను పడింది. వాటిని కొట్టి అపహరించే పనిలో పడ్డారు.
Crime News:రైతుల పంట పొలాలు, గెస్ట్ హౌస్లు, కొన్ని ప్రైవేటు వెంచర్లలో శ్రీగంధం చెట్లు పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని కొట్టి అపహరిస్తూ లక్షల్లో సంపాదించే పనిలో ఓ అంతర్రాష్ట్ర ముఠా పనిచేస్తుంది. మహారాష్ట్ర దొంగల ముఠా నల్లగొండ జిల్లాలో శ్రీగంధం చెట్లను నరికి తస్కరించే పనిలో ఉండగా, అక్కడి పోలీసులకు పట్టుబడింది. ఈ తంతు రెండు నెలలుగా జరుగుతుండగా, తాజాగా పోలీసులకు పట్టుబడ్డారు.
Crime News:మహారాష్ట్ర ముఠా వద్ద నరికివేసిన 166 శ్రీగంధం చెట్ల మొద్దులు ఉండగా, వాటి విలువ సుమారు రూ.1.66 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వారు నల్లగొండ జిల్లాలోని కనగల్, చండూరు, నార్కట్పల్లి, గుర్రంపోడు మండలాల్లో ఆ చెట్లను నరికి తరలిస్తుండగా, పోలీసులకు దొరికిపోయారు. వారి నుంచి శ్రీగంధం మొద్దులు, కోతకు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Crime News:నల్లగొండ డీఎస్పీ కే శివరాంరెడ్డి సారధ్యంలో పోలీసు బృందం దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నది. ఈ దందాలో మహారాష్ట్రకు చెందిన అన్నాభౌ లక్ష్మణ్ గైక్వాడ్ (ఏ1), దివానా (ఏ2), దద్ద సింగ్ (ఏ3), మజాన్ (ఏ4) జవాస్ (ఏ5), అజుబా (ఏ6)లు పాల్గొంటున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టుకు రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.