Crime News: మెదక్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకున్నది. కూలిపనులు చేసుకుని పొట్టపోసుకునే ఓ మహిళపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను తీవ్రంగా కొట్టి, వివస్త్రను చేసి ఓ స్తంభానికి కట్టేసిన కామాంధులు పారిపోయారు. ఆ తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలిడిసింది. సభ్యసమాజం తలదించుకునేలా దుర్మార్గానికి ఒడిగట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసులను స్థానికులు, మానవతావాదులు కోరుతున్నారు.
Crime News: మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ పరిధిలోని ఒక తండా నుంచి కూలి పనుల కోసం ఓ మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లింది. ముందస్తు ప్లాన్ చేసుకున్నారా? లేక అప్పటికప్పుడే నిర్ణయించుకున్నారో కానీ, కొందరు దుండగులు ఆ మహిళ వద్దకు వెళ్లి కూలి పని ఉన్నదని నమ్మించి వెంట తీసుకెళ్లారు. నిజమే కదా కూలి దొరికిందన్న సంబురంతో ఇంటికి నాలుగు రాళ్లు తీసుకెళ్లవచ్చనే ఆశతో ఆ మహిళ వారి వెంట వెళ్లింది.
Crime News: ఈ రోజు ఉపాధి దొరికిందన్న ఆమె ఆశలను విచ్ఛిన్నం చేస్తూ ఆ దుండగులు కొల్చారం మండలం అప్పాజిపల్లి శివారులోని ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఆ మహిళను దుండగులు తీసుకెళ్లారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడబోగా, ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ రాక్షసులు ఆమెపై విచక్షణారహితరంగా దాడికి పాల్పడ్డారు. వివస్త్రను చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగానే అక్కడ ఓ స్తంభానికి కట్టేసి నిందితులు పారిపోయారు.
Crime News: నిస్సహాయురాలిగా మిగిలిన ఆ మహిళ ఆ కట్లను తెంచుకోలేక అక్కడ నీరసించి పడి ఉన్నది. నగ్నరూపంలో ఉన్న ఆ మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు బాధితురాలిని చికిత్స కోసం మెదక్ ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని హైదరాబాద్ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.
Crime News: మెదక్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఆ మహిళ ప్రాణాలిడిసింది. ఆ దుండగుల విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలు, అఘాయిత్యానికి తట్టుకోలేక పోయింది ఆ నిస్సహాయురాలు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటన మరో మహిళకు జరగకుండా ఉండాలంటే దుండగులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.