Crime News:

Crime News: హెయిర్ క‌ట్ చేయించుకొమ్మ‌న్నందుకు ప్రిన్సిపాల్‌ను దారుణంగా పొడిచి చంపిన విద్యార్థులు

Crime News: గురు బ్ర‌హ్మ‌.. గురు విష్ణు.. గురుదేవో మ‌హేశ్వ‌రః.. గురు సాక్షాత్ ప‌ర‌బ్ర‌హ్మ‌, తస్మైశ్రీ గురువేన‌మః అనే ది సంస్కృత శ్లోకం. దీని భావం గురువు బ్ర‌హ్మ‌, విష్ణు, ప‌ర‌మేశ్వ‌రుడితో స‌మాన‌మ‌ని చెప్తుంది. ఇది గురువు యొక్క ప్రాముఖ్య‌త‌ను దైవంతో స‌మాన‌మైన స్థానాన్ని తెలుపుతుంది. మ‌రి అలాంటి గురువును ఈనాటి స‌మాజంలో కొంద‌రు తూల‌నాడుతున్నారు. మ‌రికొంద‌రు ఏకంగా హ‌తమారుస్తున్నారు.

Crime News: హ‌ర్యానా రాష్ట్రంలోని హిస్సార్ క‌ర్తార్ మెమోరియ‌ల్ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స‌భ్య స‌మాజాన్ని విస్మ‌య ప‌రుస్తున్న‌ది. మంచిగా హెయిర్ కట్ చేయించుకొని, ట‌క్ చేసుకొని స్కూల్‌కు రావాల‌ని విద్యార్థుల‌కు హిత‌బోధ చేశాడు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జ‌గ్జ‌రీ సింగ్‌. కానీ అది ఓ ఇద్ద‌రు విద్యార్థుల‌కు న‌చ్చ‌లేదు. ఆ మంచి మాట‌లు చెప్పిన ప్రిన్సిపాల్ జ‌గ్జ‌రీ సింగ్‌ను క‌త్తుల‌తో పొడిచి హ‌త్య చేశారు.

Crime News: ఇది స‌మాజంలో నీతి, నిజాయితీ ల‌క్ష‌ణాలు కొర‌వ‌డ్డాయ‌న‌డానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. విద్యార్థుల‌కు గురువుల‌పై భ‌క్తిభావం లేద‌న‌డానికి ఈ ఘ‌ట‌నే సోదాహ‌ర‌ణ‌. నేటి టీనేజీ పిల్ల‌లు మంచి, చెడు విచ‌క్ష‌ణ కోల్పోతున్నారు అనడానికి ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నమ‌ని తేలింది. మొత్తంగా ప్ర‌స్తుత స‌మాజంలో జ‌రుగుతున్న‌ ఇలాంటి విప‌రీత ధోర‌ణుల‌తో కొంత జాగ‌రూక‌త వ‌హించాల్సి ఉన్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *