Skin Pigmentation: ఇటీవల కాలంలో అనేక మంది పురుషులు, మహిళలు తమ ముఖంపై ఆకస్మికంగా ఏర్పడే నల్లటి మచ్చల (పిగ్మెంటేషన్) సమస్యతో బాధపడుతున్నారు. ఇవి ముఖం అందాన్ని మార్చడమే కాకుండా, వ్యక్తిగత ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ముఖం మీద మచ్చలు రావడం సాధారణమే. కానీ వాటిని సరైన ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. సహజమైన పదార్థాలతో ముఖాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుకోవడం ద్వారా నల్లటి మచ్చల్ని దూరం చేయవచ్చు.
ఈ మచ్చలు ఎందుకు వస్తాయి?
చర్మ నిపుణుల మాట ప్రకారం, ముఖంపై నల్లటి మచ్చలు అనేక కారణాల వల్ల వస్తాయి:
ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల చర్మం ముదురు మచ్చలుగా మారుతుంది.
గర్భం, హార్మోన్ మార్పులు వల్ల మెలాస్మా అనే మచ్చలు వస్తాయి.
మొటిమల తర్వాత మిగిలే మచ్చలు కూడా ఒక కారణం.
వయస్సు పెరగడం, ఒత్తిడి, విటమిన్ లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
ఇంటి చిట్కాలు – సహజమైన పరిష్కారాలు :
నల్లటి మచ్చలను తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని సహజ పదార్థాలతో చేసుకునే చిట్కాలు ఉన్నాయి:
నిమ్మరసం, పంచదార:
నిమ్మరసం చర్మాన్ని తేలికగా బ్లీచింగ్ చేస్తుంది. పంచదార చర్మం మీద మృత కణాలను తీసేస్తుంది. వీటిని కలిపి మచ్చలపై రాసి సున్నితంగా రుద్దాలి. వారానికి 2 సార్లు చేయొచ్చు.
కలబంద, విటమిన్ ఇ:
తాజా అలోవెరా జెల్‌లో విటమిన్ ఇ ఆయిల్ కలిపి ముఖంపై రాస్తే చర్మం మెరిసిపోతుంది. రాత్రి వేయడం మంచిది.
పసుపు, శనగపిండి ప్యాక్:
ఒక టీస్పూన్ శనగపిండి, అర టీస్పూన్ పసుపు, కొద్దిగా గులాబీ నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖంపై రాసి, 15 నిమిషాల తర్వాత కడగాలి.
Also Read: Roses: ఆహా గులాబీ! అందం మాత్రమే కాదు… ఆరోగ్యానికి అద్భుత ఔషధం
బంగాళదుంప రసం:
బంగాళదుంపను తురిమి రసాన్ని మచ్చలపై రాయండి. రోజూ చేస్తే మచ్చలు మెల్లగా తగ్గుతాయి.
ఎర్ర కందిపప్పు పేస్ట్:
రాత్రి కందిపప్పును పాల్లో నానబెట్టి, ఉదయం పసుపు కలిపి మిక్సీ చేసి ముఖానికి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేయండి.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ తప్పక వాడాలి.
రోజూ 2–3 లీటర్ల నీళ్లు తాగాలి.
విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉన్న పండ్లు, ఆకుకూరలు తినాలి.
ముఖాన్ని గట్టిగా రుద్దడం, రసాయన పదార్థాలు వాడకపోవడం మంచిది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.