Crime News: ఇటీవల రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతున్నది. ఆ రీల్స్ పిచ్చితో ఎందరో యువతీ, యువకులు ఎందరో తమ ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఇదే కోవలో ఇప్పటికీ ఆ పిచ్చిని ఇతరులూ వదలడమే లేదు. ఒకరిని మించి ఒకరు ఆ రీల్స్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రమాదమని తెలిసి, ప్రాణాలు పోతాయేమోననే అనుమానం ఉన్నా అస్సలు తగ్గడం లేదు. అదే పిచ్చితో తాజాగా ఓ యువకుడు తన ప్రాణాన్నే తీసుకున్నాడు. స్నేహితులు తీసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Crime News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కల్యాణ రేపు జలపాతంలో ఓ యువకుడు రీల్స్ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. తన స్నేహితులు వీడియో తీస్తుండగా, యూనిస్ (23) అనే వ్యక్తి జలపాతంలో దూకాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న ఆ జలపాతం వరదలో మునిగి అతను గల్లంతయ్యాడు. రెండు రోజులైనా అతని ఆచూకీ దొరకలేదు. ఇప్పటికీ వెతుకుతున్నారు.