Crime News:

Crime News: ప్రేమ జంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ప్రియుడి మృతి, ప్రియురాలి ప‌రిస్థితి విష‌మం

Crime News: ఓ ప్రేమ జంట ఆత్మ‌హ‌త్యానికి పాల్ప‌డిన ఘ‌ట‌న జ‌న‌గామ జిల్లాలో చోటుచేసుకున్న‌ది. గాఢంగా ప్రేమించుకున్న ఆ ఇద్ద‌రూ ఇటీవ‌లే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు ఒప్పించి, ఇండ్ల‌కు తీసుకొచ్చి మ‌ళ్లీ బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి జ‌రిపిస్తామ‌ని చెప్ప‌డంతో న‌మ్మి వ‌చ్చారు. అయితే ఆ వివాహం నిలిచిపోవ‌డంతో వారిద్దరూ ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధ‌ప‌డ్డారు. వారిలో ఒక‌రు చ‌నిపోగా, మ‌రొక‌రు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Crime News: జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మండ‌లం తాటికొండ గ్రామంలో మార‌పాక‌ అన్వేష్ (26), గ‌డ్డం పావ‌ని (22) గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకున్నారు. వారి వివాహాన్ని ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఎవ‌రికీ చెప్ప‌కుండా నాలుగు నెల‌ల క్రితం ఆ ప్రేమ జంట ర‌హ‌స్యంగా వివాహం చేసుకున్న‌ది. అయితే ఇరుకుటుంబాల‌కు తెలిసి పెళ్లి జ‌రిపిస్తామ‌ని చెప్పి వారిద్ద‌రినీ ఒప్పించారు.

Crime News: వారిద్ద‌రి కుటుంబాల్లో పెళ్లికి ఒప్పందం కుదిరినా, కొన్ని కార‌ణాల వ‌ల్ల వారి పెళ్లి నిలిచిపోయింది. త‌మ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోర‌నే ఉద్దేశంతో వారిద్ద‌రూ చ‌నిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. తాటికొండ‌లోనే గ‌డ్డిమందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఘ‌ట‌నా స్థ‌లంలోనే అన్వేష్ చ‌నిపోగా, పావ‌నిని వ‌రంగ‌ల్‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *