Crime News: డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వారికి తొలినాళ్లలో మొదటి తప్పుగా భావించి వదిలేసేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు జరిమానాతో సరిపెట్టేవారు. కొన్నిచోట్ల కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తూ శిక్షను విధించేవారు. ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తీవ్రతను బట్టి జైలు శిక్షను కూడా కోర్టుల్లో అమలు చేస్తున్నారు. అందుకే తాగి వాహనాలు నడిపితే మీరూ జైలుపాలు కావచ్చు. ఈ విషయం తెలిసినా ఎందరో తాగి వాహనాలు నడుపుతూ ఎన్నో ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు.
Crime News: తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. 13 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారందరినీ పోలీసులు కోర్టులు హాజరుపర్చారు. వారిలో ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష, మరొకరికి ఒకరోజు జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట ద్వితీయ న్యాయమూర్తి శ్రీమతి బీవీ రమణ తీర్పు చెప్పినట్టు సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు.
Crime News: మిగతా తొమ్మిది మందికి రూ.9,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారని ఎస్ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతోపాటు జైలు శిక్ష కూడా తప్పదని ఆయన హెచ్చరించారు. దీన్నిబట్టి ఇది గత కొన్నాళ్లుగా జైలు శిక్షను విధిస్తున్నా, ఇక మున్ముందు కూడా తీవ్రతను బట్టి మద్యంతాగి వాహనాలు నడిపేవారికి జైలు శిక్ష తప్పదని పోలీసు శాఖ హెచ్చరిస్తున్నది.