Crime News:వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ హోంగార్డు నిండు ప్రాణం బలైంది. అక్కడి పోలీస్ వాహనాలను శుభ్రం చేసే పనిలో ఉండగా, విద్యుత్ షాక్ తగలడంతో హోంగార్డు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండం కౌకుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసు అధికారులు తెలిపారు. దీంతో అతని కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయంపై దిగువస్థాయి సిబ్బంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.

