Crime News:

Crime News: డేటింగ్ పేరుతో యువ‌తికి మోసం.. విదేశాల‌కు యువ‌కుడి ప‌రారీ

Crime News:ఇదో ర‌క‌మైన మోసం.. ప్రేమ పేరుతో వంచ‌న‌.. డేటింగ్ అంటూ ద‌గా.. పెళ్లి చేసుకుంటాన‌ని బ్లాక్ మెయిల్‌.. ఇలాంటివి త‌ర‌చూ జ‌రుగుతున్నా.. అమాయ‌క యువ‌తులు మోస‌పోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువ‌తిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి, కొంత‌కాలం డేటింగ్ చేసి విదేశాల‌కు వెళ్లి ఆ యువ‌తిని మోసం చేశాడు ఓ న‌య వంచ‌కుడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో వెలుగు చూసింది.

Crime News:హైద‌రాబాద్ న‌గ‌రంలోని అమీర్‌పేట‌కు చెందిన యువ‌తిని బెంగ‌ళూరులోని కామ‌న్ ఫ్రెండ్స్ మీటింగ్‌లో ఓ వేలూరి శశాంక్ అనే యువ‌కుడు క‌లిశాడు. తొలిచూపులోనే న‌చ్చావ‌ని, పెళ్లి కూడా చేసుకుంటాన‌ని ఆయువ‌తికి శశాంక్‌ మాటిచ్చాడు. మాయ‌మాట‌ల‌తో ఆ యువ‌తిని శారీర‌కంగా లోబ‌రుచుకున్నాడు.

Crime News:డేటింగ్ పేరుతో కొంత‌కాలం ఆ యువ‌తితో శశాంక్‌ క‌లిసి ఉన్నాడు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఉన్న‌త చ‌దువుల కోసం యూకే వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటాన‌ని ఆ యువ‌తిని అత‌ను న‌మ్మ‌బ‌లికాడు. నిజ‌మేన‌ని ఆ యువ‌తి అత‌డిని న‌మ్మింది. తీరా విదేశాల‌కు వెళ్లాక యువ‌తిని అన్ని సామాజిక మాధ్య‌మాల్లో శశాంక్ బ్లాక్ చేశాడు. తాను మోస‌పోయాన‌ని తెలుసుకున్న ఆ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

Crime News:ఆ యువ‌తి ఫిర్యాదు మేర‌కు శశాంక్‌పై హైద‌రాబాద్‌ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసులు లుకౌట్ నోటీసుల‌ను జారీ చేశారు. యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌స్తున్నాడ‌ని స‌మాచారం అందుకొన్న పోలీసులు, కాపు కాచి ఎయిర్ పోర్ట్‌లో శశాంక్‌ను అరెస్టు చేశారు. దీంతో యువ‌తిని మోసం చేసి పారిపోయిన విష‌యంపై శశాంక్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *