Rajanna Sircilla: గత కొంతకాలంగా అటవీ జంతువులు ఊళ్లపై బడుతున్నాయి. ఇటీవల తరచూ చిరుతపులులు, ఏనుగులు ఊళ్లలోకి వస్తూ జనాన్ని భయంభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు, కొండముచ్చులు, జింకలు ఇలా పలు జంతువులు వచ్చినా అడవిలోనే ఉండే నక్కలు ఊళ్లలో తిరిగాడుతున్నాయి. కుక్కల వలే ఉండే ఈ జాతిని మనుషులు కూడా సరిగా గుర్తించ వీలుండదు. దీంతో ఇటీవలే వాటిని కొందరు చేరదీస్తున్నారు కూడా. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నక్క వీరంగం సృష్టించింది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో సంచరిస్తున్న నక్క కలకలం రేపింది. ఈ నక్క దాడిలో నలుగురు గ్రామస్తులు గాయాలపాలయ్యారు.
Rajanna Sircilla: మద్దికుంట గ్రామంలోకి ఆదివారం తెల్లవారుజామున నక్క ప్రవేశించింది. తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న రాధమ్మ అనే మహిళపై నక్క దాడి చేసింది. పొలం పనులకు వెళ్తున్న డీటీ సత్తయ్య, తెర్లుమద్ది కిషన్, మరొకరిపై నక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో గ్రామస్థులు నక్క వెంటపడి దానిని కొట్టి చంపారు. రాధమ్మ పరిస్థితి విషమించడంతో సిరిసిల్ల దవాఖానకు తరలించారు.