Cricket: చండీగఢ్‌లో జరుగుతున్న భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య రెండో వన్డేలో భారత్ జట్టు 292 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు ప్రతిక రావల్ మరియు స్మృతి మంధన జట్టుకు మంచి ఆరంభం అందించారు. ప్రతిక రావల్ 25 పరుగుల వద్ద గార్డ్నర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యారు. ఈ సమయంలో బ్యాటింగ్ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, స్మృతి మంధన ధైర్యంగా ఆడుతూ 91 బంతుల్లో 117 పరుగులు చేసి మరో శతకాన్ని నమోదు చేసింది.
తరువాత క్రీజ్‌లోకి వచ్చిన దీప్తి శర్మ (40) మరియు ప్రతికా రిచా ఘోష్ (29) సంయమనంతో బ్యాటింగ్ కొనసాగించారు. చివరలో దిగిన స్నేహ్ రాణా 18 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టుకు చివరి స్పర్శ ఇచ్చింది.
అంతిమంగా టీమిండియా మొత్తం 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్ 3, గార్డ్నర్ 2, అలాగే సదర్లాండ్, మెక్‌గ్రాత్, షట్ ఒక్కో వికెట్ సాధించారు.