Bhagyashri Borse: టాలీవుడ్‌లో గ్లామర్‌తో యువత హృదయాలను కొల్లగొడుతూ ముంబై బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ సినిమాతో బిజీగా ఉన్న ఈ అమ్మడు, శ్రీలీల వదిలేసిన బంగారు అవకాశాన్ని ఒడిసిపట్టింది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికై, పోస్టర్ కూడా విడుదలైంది. కానీ, ఆమె హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో భాగ్యశ్రీకి లక్కీ బ్రేక్ లభించింది. గతంలో ‘కింగ్‌డమ్’ కోసం శ్రీలీలను సంప్రదించగా, బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఒప్పుకోలేదని సమాచారం.
భాగ్యశ్రీ మాత్రం వరుసగా పెద్ద హీరోల సినిమాలతో దూసుకెళ్తోంది. రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంత’ సినిమాల్లో నటిస్తూ షూటింగ్‌లో నిమగ్నమైంది. అంతేకాదు, ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కోసం కూడా ఆమెను సంప్రదించారని టాక్. ఈ లైనప్‌తో లక్కీ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ, ఒకవేళ ప్రభాస్ సినిమాలోనూ నటిస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉంది.