Coolie vs War 2: ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలు వార్ 2, కూలీ. ఒకవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీతో వస్తున్న వార్ 2, మరోవైపు రజినీకాంత్ స్టార్‌డమ్‌తో కూలీ.. రెండు సినిమాలూ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. ఆడియెన్స్ రెండు వర్గాలుగా విభజన అయ్యి తమ ఫేవరెట్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే, బుక్ మై షో లెక్కల ప్రకారం, కూలీకి రెండు లక్షల ఇంట్రెస్ట్‌లు నమోదు కాగా, వార్ 2 మాత్రం మూడున్నర లక్షలకు పైగా ఇంట్రెస్ట్‌లతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ హైప్‌తో ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలయ్యే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీని రేపుతాయి? ఏ సినిమా ఆడియెన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేస్తుంది? ఇప్పుడు అందరి చూపు ఈ సినీ యుద్ధం వైపే ఉంది.
							
