Anirudh: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, చిత్రంలోని పవర్‌హౌస్ పాటపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికన్ రాపర్ లిల్ నాస్ ఎక్స్ 2021 హిట్ ఇండస్ట్రీ బేబీతో ఈ పాటను పోల్చుతున్నారు. బాణీ, ర్యాప్ నిర్మాణంలో పోలికలున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రెండు పాటల జైలు నేపథ్య విజువల్స్ కూడా ఈ పోలికలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే, పవర్‌హౌస్ పూర్తిగా కాపీ అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటున్నారు. అనిరుధ్ స్ఫూర్తి పొందినా, కథకు తగ్గట్టు మార్చాడని సమర్థిస్తున్నారు. అనిరుధ్ లాంటి సంగీత దర్శకుడు కాపీకి పోతాడని నమ్మడం కష్టమని అభిమానులు చెబుతున్నారు. చిత్ర బృందం ఈ ఆరోపణలపై ఇంతవరకూ నోరు విప్పలేదు. అయితే అనిరుధ్, రజనీకాంత్‌కు బంధువైనా, కూలీ కోసం పూర్తి నిబద్ధతతో పనిచేశారని నిర్మాతలు వెల్లడించారు.
