Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారీ చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్స్ పూర్తి ఊపులో ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్, కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని, అందుకే శివ రాజ్ కుమార్ తన కుటుంబమని వ్యాఖ్యానించారు.
Also Read: Beggar: ‘బెగ్గర్’.. పూరీ మాస్టర్ ప్లాన్ తో బాక్సాఫీస్ షేక్?
Kamal Haasan: ఈ వ్యాఖ్యలు కన్నడ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. కన్నడ భాషపై గర్వంగా ఉండే కర్ణాటక ప్రజలు ఈ కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సినిమా రిలీజ్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? కమల్ హాసన్ ఈ విషయంపై స్పష్టత ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘థగ్ లైఫ్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.