Bhadradri Kothagudem Collector: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆ జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆమె బాటలోనే మరో జిల్లా కలెక్టర్ సతీమణి కూడా ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేశ్ వీ పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేశ్ వీ పాటిల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
Bhadradri Kothagudem Collector:తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్టు పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తొలి కాన్పులో కూడా ఆమెకు మగబిడ్డ కలగడం విశేషం. చాలా కాలంగా అదే ఆసుపత్రిలో ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. శ్రద్ధ జీతేశ్ వీ పాటిల్ దంపతుల నిర్ణయంపై వైద్యులు, సిబ్బంది, ఇతర పేషెంట్లు వారి బంధువులు అభినందనలు తెలిపారు.
Bhadradri Kothagudem Collector: ప్రభుత్వ ఆసుప్రతిలో వైద్యం చేయించుకొని ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచిన కలెక్టర్ జీతేశ్ వీ పాటిల్ దంపతులకు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు అభినందనలు తెలిపారు. ఇతర పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులను వదిలి కేవలం సీహెచ్‌సీలో కాన్పు చేయించుకోవడంతో ప్రభుత్వ వైద్యంలో కింది స్థాయి వరకు ఎలా బలోపేతం అయ్యాయో ఈ సంఘటన రుజువు చేసిందని గుర్తుచేశారు.
Bhadradri Kothagudem Collector:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ ఆసుప్రతిలో ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ సతీమణి శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు తెలిసి.. కలెక్టర్ దంపతులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సౌకర్యంలో ప్రసూతి సేవలను పొందడంలో కలెక్టర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.