Mahaa Effect: మహా న్యూస్ కథనానికి స్పందించిన మురమళ్ళ ఆర్. డబ్ల్యు. ఎస్ సిబ్బంది. ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో జల జీవన మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించే చెరువులో చేపలు చనిపోయిన దుర్వాసన వస్తున్నాయని వచ్చిన కథనానికి ఆర్.డబ్ల్యూ ఎస్ జే.ఈ చందు స్పందించి చర్యలు చేపట్టారు. చనిపోయిన చేపలను తన సిబ్బందితో కలిసి బయటికి తీయించారు. వేసవికాలంలో ఆక్సిజన్ అందక చేపలు చనిపోయాయని ఇలాంటి ఘటన మరల పునరావతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుంటామని జే.ఈ చందు తెలిపారు.
