Priyanka Mohan

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్‌పై కుట్ర.. కెరీర్‌కు బ్రేకులు?

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్.. టాలీవుడ్‌లో గ్యాంగ్ లీడర్‌తో ఆరంగేట్రం చేసిన కన్నడ అమ్మాయి. శర్వానంద్ శ్రీకారం ఫ్లాప్ అయినా, శివకార్తీకేయన్, సూర్య, ధనుష్, జయం రవిలతో జోడీ కట్టి కోలీవుడ్‌లో సత్తా చాటింది. కానీ, ఇప్పుడు ఆమె అవకాశాలు ఆగిపోయాయి. కారణం ప్లాపులు కాదని, ఓ పీఆర్ ఏజెన్సీ కుట్రేనని బజ్. విజయ్, సమంత, రష్మికలతో పనిచేసే ప్రముఖ ఏజెన్సీతో ప్రియాంక ఒప్పందం క్యాన్సిల్ చేసుకోవడంతో, ఆమెపై నెగిటివ్ క్యాంపెన్ మొదలైందని టాక్. సోషల్ మీడియాలో ట్రోల్స్, నటనపై విమర్శలు, జాబిలమ్మ సాంగ్ డ్యాన్స్‌పైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దీంతో ఆమె మార్కెట్ దెబ్బతింటోందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజీ, కవిన్ మూవీలతో కంబ్యాక్‌కు సిద్ధమవుతున్న ప్రియాంక.. ఈ కుట్రను ఎదుర్కొని సక్సెస్ సాధిస్తుందా? లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *