SSMB29: ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) మరియు ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ (2017) సినిమాలను కలిపి “బాహుబలి: ది ఎపిక్” ను ఇటీవల ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు రీరిలీజ్ చేసిన సినిమాలలో భారీ వాసులని సాధించింది.
గత కొన్ని నెలలుగా “బాహుబలి: ది ఎపిక్” తో బిజీ గా ఉన్న రాజమౌళి. ఇపుడు తన నెక్స్ట్ సినిమా SSMB29 ప్రొమోషన్స్ పైన దృష్టి సాధించారు. సినిమా రిలీజ్ కి ఇంకో ఏడాది సమయం ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కావడంతో హోలీవడ్ స్టైల్ ప్రమోషన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా వన్ ఇయర్ ముందునుండే సినిమా కంటెంట్, టీజర్, ట్రైలర్ 1,2 అండ్ ఫైనల్ ట్రైలర్ వంటి వాటితో సినిమాపైన హైప్ ని పెంచుతారు.
ఈ భారీ చిత్రం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ SSMB29, కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి “వారణాసి” అనే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. సినిమా కథ ప్రకారం ఈ టైటిల్ బాగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గత కొన్ని రోజుల నుండి వారణాసి అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్క ప్రొడక్షన్ హౌస్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించడంతో పటు షూటింగ్ స్టార్ట్ సూన్ అంటూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం రాజమౌళి అండ్ టీమ్ వారణాసి అని టైటిల్ ని మహేష్ మూవీకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా కథ ప్రకారం ఈ టైటిల్ బాగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇపుడు ఆల్రెడీ వారణాసి టైటిల్ రిజిస్టర్ చేసుకున్న ప్రొడక్షన్ హౌస్ నుండి ఈ టైటిల్ రైట్స్ తీసుకుంటారా లేక ఇంకో టైటిల్ పెడతారా, వారణాసికి టైటిల్ కి ట్యాగ్ యాడ్ చేసి పెడతారా చూడాలి.
నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు ఆస్కార్ అవార్డు విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
‘RRR’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో “వారణాసి”పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయంగా కూడా ఈ సినిమా భారీ హైప్ సృష్టిస్తోంది.

