CM Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కానీ ముందరికాళ్లకు బంధాలెన్నో.. ఆ బంధాలను ఒక్కొక్కటిగా తెంచుకునే పనిలో తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు సంయమనంతో పనిచేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడిప్పుడే పట్టు బిగుస్తున్నట్టు తాజా పరిణామాలు అర్థమవుతున్నాయి. అధిష్టానం ఆదేశాలను తూచ తప్పకుండా, సీనియర్ల సలహాలు ఆచరిస్తూ వస్తున్న ఆయన.. ఇక నుంచి సొంత నిర్ణయాలే తీసుకునేందుకు సిద్ధమయ్యారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది.
CM Revanth Reddy:తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న ఓ నిర్ణయమే దానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. సీనియర్ మంత్రుల ఆధిపత్యానికి చెక్ పెట్టే పనిలో ఉన్నారని తెలుస్తున్నది. దీంతో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధిష్టానం, సీనియర్ల బరువును తగ్గించుకోవడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తున్నది. తాజాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రుల మార్పుతో తన మార్కును చూపారు.
CM Revanth Reddy:కీలక శాఖల నిర్వహణలో ఉన్న ఒత్తిడి, రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులను మార్చినట్టు చెప్తున్నా, సీనియర్ల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇలా చేశారని భావిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా కొండా సురేఖలను జిల్లా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి సీఎం రేవంత్‌రెడ్డి తప్పించ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
CM Revanth Reddy:వారి స్థానాల్లో కొత్త మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. కొండా సురేఖను తప్పించి మెదక్ జిల్లా బాధ్యతలను కొత్తగా మంత్రి అయిన గడ్డం వివేక్‌కు, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో నల్లగొండ బాధ్యతల్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్థానంలో కొత్త మంత్రి వాకిటి శ్రీహరికి నూతన బాధ్యతలను అప్పగించారు.
CM Revanth Reddy:తరచూ కొన్ని నిర్ణయాలతో వివాదాస్పదంగా మారుతున్న మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖను ఆ బాధ్యతల నుంచి మార్చినట్టు చెప్పుకుంటున్నారు. కానీ, మంత్రివర్గంలో తొలి నుంచి కీలకంగా భావిస్తూ వస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మార్చడం సీఎం సాహసోపేత నిర్ణయమని తెలుస్తున్నది. వీరిద్దరూ సీఎం వైఖరిపై గుర్రుగానే ఉంటూ వస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతున్నది.
CM Revanth Reddy:గతంలో కూడా సీఎం పదవి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి పేరుపై ఉత్తమ్, కోమటిరెడ్డి విభేదించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ భేదాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అధిష్టానం వద్ద సీఎం రేవంత్‌రెడ్డిపై తరచూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదుల పర్వం ఎక్కువైందని, ఆ ఉద్దేశంతోనే వారి ఆధిపత్యానికి చెక్ పెట్టే పనిలో సీఎం పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
CM Revanth Reddy:ఇదిలా ఉండగా, నల్లగొండ జిల్లా విషయంలో సీనియర్ మంత్రులైన ఉత్తమ్, కోమటిరెడ్డి ఆధిపత్యం ఎక్కువైందని, కనీసం సీఎం రేవంత్‌రెడ్డి కూడా సొంతంగా పనులు చేసుకునే వెసులుబాటు లేకుండా చేసేస్తున్నారని సీఎం సన్నిహిత వర్గాలే చెప్తున్నాయి. దీంతో నల్లగొండ నుంచి వారిద్దరినీ దూరం పెట్టాలంటే, సరైన మంత్రిని తేవాలని భావించే తనకు సన్నిహితంగా ఉండే కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతుంది. ఆయన నియామకంతో ఆ ఇద్దరికీ చెక్ పెట్టే పని సులువు అవుతుందని సీఎం భావించారని తెలుస్తున్నది.
వీరే జిల్లా ఇన్‌చార్జి నూతన మంత్రులు
CM Revanth Reddy:దామోదర రాజనర్సింహ-మహబూబ్‌నగర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి- వరంగల్, పొన్నం ప్రభాకర్- హైదరాబాద్, డి అనసూయ సీతక్క- నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు- కరీంనగర్, జూపల్లి కృష్ణారావు- ఆదిలాబాద్, గడ్డం వివేక్ వెంకటస్వామి- మెదక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్- నల్లగొండ, వాకిటి శ్రీహరి- ఖమ్మం.