Carlos Alcaraz: స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్‌కు ఏటీపీ ఫైనల్స్ లో షాక్ తగిలింది. ఏటీపీ ఫైనల్స్ టోర్నీని ఈ స్టార్ ప్లేయర్ ఓటమితో ప్రారంభించాడు. ఈ టోర్నీ మూడోసీడ్ అల్కరాస్ 6-1, 7-5తో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
Carlos Alcaraz: బిగ్ 3 ఎరా ముగిసిన తర్వాత ఫ్యూచర్ టాప్ స్టార్ గా కితాబందుకున్న అల్కరాజ్ ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తొలి మ్యాచ్ లోనే కంగుతిన్నాడు. తొలి సెట్లో విజృంభించి ఆడిన రూడ్.. ఆల్కరాస్ కు ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. ఒక్క మ్ మాత్రమే చేజార్చుకున్న రూడ్.. తేలిగ్గా సెట్ గెలిచాడు. రెండో సెట్లో 5-4తో సెట్ గెలిచేలా ఆల్కరాస్ కనిపించినా ఈ స్థితిలో అతడి సర్వీస్ బ్రేక్ చేసిన రూడ్ స్కోరు 5-5తో సమం చేశాడు. తర్వాత పన్నెండో గేమ్‌లో మరోసారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన రూడ్.. సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో అల్కరాస్‌తో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన రూడ్‌కు ఇదే తొలి విజయం. మరో మ్యాచ్‌లో టాప్‌సీడ్ ఇటలీకి చెందిన యానెక్ సినర్ 6-3, 6-4తో ఆస్ట్రియా టెన్నిస్ ప్లేయర్ డిమినార్ విజయంతో శుభారంభం చేశాడు.