Revanth Reddy: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల ఐక్యతకు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన సందేశంలో మాట్లాడుతూ… “తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆనందోత్సాహాలతో, ఆటపాటలతో ఈ పండుగను జరుపుకోవాలి” అని ఆకాంక్షించారు.
బతుకమ్మ పండుగ పూల పండుగ మాత్రమే కాదని, ఇది ప్రజల ఐక్యతను, సమైక్యతను చాటిచెబుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతికి ఈ పండుగ ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలను తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.