CM Revanth Reddy: వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం (అక్టోబర్ 31) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా 1.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టంవాటిలింది. ఈ మేరకు వరంగల్, హనుమకొండ, హుస్నాబాద్ ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత ఏరియల్ సర్వేకు బయలుదేరి వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని రంగంపేట, సమ్మయ్యనగర్, పోతనా నగర్ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఇదేరోజు సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో వరదలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేయనున్నారు.


