CM Revanth Reddy:

CM Revanth Reddy: మ‌హాగ‌ణ‌ప‌తికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌త్యేక‌ పూజ‌లు

CM Revanth Reddy: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తిని సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు (సెప్టెంబ‌ర్ 5) ఉద‌యం కాసేప‌ట్లో ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హాగ‌ణ‌ప‌తికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయ‌న మ‌హాగ‌ణ‌ప‌తి వ‌ద్ద‌కు చేరుకోనున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకోవ‌డం విశేషం.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి వ‌ద్ద‌కు రానుండ‌టంతో పోలీస్ అధికారులు ఇప్ప‌టికే ప‌టిష్టంగా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌లు సుభిక్షంగా ఉండాల‌ని, భ‌క్తులంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని ఆ గ‌ణ‌నాథుడిని సీఎం ఈ సంద‌ర్భంగా కోరుకోనున్నారు. ఆయ‌నతో పాటు మ‌హా గ‌ణ‌ప‌తి వ‌ద్ద‌కు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా రానున్నారు.

CM Revanth Reddy: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, కొండా సురేఖ‌తో పాటు ప‌లువురు నాయ‌కులు, ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు సీఎం, ఇత‌ర ప్ర‌ముఖుల రాక‌తో ఖైర‌తాబాద్ ప్రాంతంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొనే అవ‌కాశం ఉన్న‌ది. ఇప్ప‌టికే పోలీసులు పెద్ద ఎత్తున మోహ‌రించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *