CM Revanth Reddy

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం, హైదరాబాద్‌లో కొత్త ఏఐ సెంటర్ ప్రారంభం

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ, మైక్రోసాఫ్ట్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒక ఏఐ సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం సహకరించబోతున్నట్లు ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో యువతకు మరింత ఉద్యోగ అవకాశాలు వస్తాయ్ అని తేలిపారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో కొత్త మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మైక్రోసాఫ్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెడుతూ, గవర్నెన్స్, పబ్లిక్ సర్వీసెస్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు.

Also Read: Kerala Tourism Places: కేరళలోని ఈ అద్భుతమైన ప్రదేశాలు.. జీవితంలో ఒక్కసారయినా చూడాలి !

ఈ భాగస్వామ్యం, తెలంగాణలోని స్టార్ట్‌అప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంతో పాటు, మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్‌వర్క్ యాక్సెస్‌ను కూడా అందించనుంది. మైక్రోసాఫ్ట్‌ యొక్క 25 సంవత్సరాల పురాతన బంధం, హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్‌ మరియు ప్రభావాన్ని సాధించడంలో కీలకంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తేలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *