Cm Revanth Reddy: కేసీఆర్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్ది. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవానివ్వనని చెప్పారు.దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. ప్రజల కోసం ఎవరు ఏం చేశారో తేలుద్దామని ఆయన సవాల్ విసిరారు.”ఓడిపోంగనే ఇంట్లపోయి పంటవా.. ఇదా ప్రతిపక్ష నాయకుడంటే?! రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. మూడుసార్లు ఓడిపోయినా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడంటే..‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడిస్తానన్న. .. ఓడించిన. పార్లమెంట్ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా తెప్పిస్తానన్న. తెప్పించిన.ఇప్పుడు వరంగల్ గడ్డ మీది నుంచి చెప్తున్న. కేసీఆర్..! కాస్కో. నీ బీఆర్ఎస్ను మళ్లా మొలవనియ్య. మా కార్యకర్తల పౌరుషమేందో.. నీ ఫామ్హౌస్ కుట్రలు, కుతంత్రాలేందో తేల్చుకుందాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సైతం మండిపడ్డారు. గుజరాత్‍లో సబర్మతి నది ప్రక్షాళన చేపడ్తే మోదీని గొప్ప పని చేశావంటూ చప్పట్లు కొట్టే కేంద్ర మంత్రి కిషన్‍రెడ్డి.. హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవానికి మాత్రం అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘దీనిపై నేను ప్రశ్నిస్తే.. ‘‘సోనియాకు గులామువా” అంటున్నడు. ఆంధ్రప్రదేశ్‍లో కాంగ్రెస్ పార్టీ సచ్చిపోయినా.. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ. తెలంగాణలోని నాలుగుకోట్ల బిడ్డలకు కన్నతల్లి. ఆమెకు ఊడిగం కాదు.. ఆమె కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువే అవుతుంది. అది అవమానం కాదు.. ఆత్మగౌరవం. ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కునేందుకు రా. ఆమె కాళ్లు కడిగి మనమిద్దరం నెత్తిమీద చల్లుకుందాం” అని కిషన్రెడ్డికి సీఎం సూచించారు.
.