Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పార్టీ మార్పు, అసెంబ్లీ వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కండువా కప్పుకోవడం వల్ల పార్టీ మారినట్టుగా భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. “ఈ రోజు కూడా చాలామందికి నేను కండువాలు కప్పాను. కానీ కండువాలో ఏముందో వారికి తెలియదు. ఎవరింటికైనా వెళ్తే, అక్కడ ఏ భోజనం పెడతారో ముందే చెప్పగలమా?” అంటూ రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అలాగే, బీఆర్ఎస్ తరపున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వేతనాల నుంచి ఇప్పటికీ రూ.5 వేల చొప్పున ఆ పార్టీకి వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. దీనిని ఉదాహరించుతూ, ఇంకా సాంకేతికంగా కొంతమంది ఎమ్మెల్యేల వేతనాలు బీఆర్ఎస్ ఖాతాకే జమ అవుతున్నాయని వివరించారు.
ఇంకా అసెంబ్లీ బలం గురించి మాట్లాడుతూ, బీఆర్ఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలోనే హరీష్ రావు ఆన్ రికార్డ్‌గా చెప్పిన విషయం గుర్తుచేశారు. దీంతో బీఆర్ఎస్ అసలు పరిస్థితి ఏమిటో స్పష్టమవుతోందని రేవంత్ వ్యాఖ్యానించార.