Cm revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏఐ హబ్ (AI Hub), టీ-స్క్వేర్ ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం అధికారులు, సాంకేతిక నిపుణులతో పలు సూచనలు చేశారు.
నవంబర్ నెలాఖరు నాటికి టీ-స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని ఆదేశించిన ఆయన, “టీ-స్క్వేర్ 24 గంటల పాటు పనిచేయగల విధంగా ఏర్పాట్లు చేయాలి. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేయాలి,” అని సూచించారు.
ప్రాజెక్టు రూపకల్పనలో ఆధునికత, సౌలభ్యం, సాంకేతికతకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. “యాపిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఔట్‌లెట్‌లను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఆకర్షణీయ వాతావరణం ఉండాలి,” అని రేవంత్ అన్నారు.
ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, అలాగే టెక్ కంపెనీలు, స్టార్టప్‌లకు ఉపయోగపడే యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలన్నారు. టెక్నాలజీ రంగంలో తెలంగాణను దేశంలోనే ముందంజలో ఉంచేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు.