Chandrababu Naidu:తిరుపతిలో మూండేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలనికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత ఆదివారం బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు.
