Viral News: వివాహేతర సంబంధాల గురించి తరచూ వార్తలు వింటుంటాం. ఇప్పుడు ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది, ఓ మహిళ తన ప్రేమికుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రైల్వే స్టేషన్‌లో ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. తర్వాత ఆ ముగ్గురు వ్యక్తుల మధ్య పెద్ద గొడవ జరగడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral News: బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది, ప్రేమికుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించిన భార్యను తన భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అవును, ఇక్కడి రైల్వే స్టేషన్‌లో CRPF కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈ వ్యక్తి తన భార్య తన ప్రేమికుడితో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈ మహిళ నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో అయన పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. అక్టోబర్ 31న, ఆమె తన ప్రేమికుడితో కలిసి పాట్నా-సింగ్‌రౌలీ రైలులో పారిపోవడానికి ప్రయత్నించింది, ఈ విషయం గురించి సమాచారం అందుకున్న భర్త పాట్నా జంక్షన్‌కు వెళ్లగా. అక్కడ తన భార్యను వేరే వ్యక్తితో చూడడంతో కోపం తెచ్చుకున్నాడు. రైల్వే స్టేషన్ లోనే ఆగ్రహంతో భార్య ప్రియుడిని కొట్టి, ఆపై భార్యను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ప్రేమికుడు భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు.
ఇది కూడా చదవండి: Gold Omelette: ఆమ్లెట్టే కదా అని తీసిపారేయకండి.. దీని స్పెషాలిటీ తెలిస్తే గుండె ఆగిపోద్ది !
Viral News: ఘర్కేకలేష్ అనే X ఖాతా లో ఈ వీడియో అప్లోడ్ చేయుయడంతో CRPF జవాన్ మరియు అతని భార్య ప్రేమికుడి మధ్య జరిగిన ఫైట్ మనం చూడవొచ్చు. భార్య ప్రేమికుడితో కలిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. కోపంతో అక్కడికి వచ్చిన భర్త అందరి సమక్షంలోనే భార్య ప్రేమికుడిని కొట్టాడు. అనంతరం భార్యను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు.
Viral News: ఆగస్టు 31న షేర్ చేసిన ఈ వీడియోకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి, అనేక కామెంట్లు వచ్చాయి. ఒక వినియోగదారు, “అలాంటి స్త్రీ సమాజానికి అవమానకరం” అన్నారు. పెళ్లయిన తర్వాత కూడా కొందరు తమ బాధ్యతలను మరచి వివాహేతర సంబంధాలకు పాల్పడడం నిజంగా సిగ్గుచేటు’’ అని మరో వినియోగదారు వ్యాఖ్యానించారు.
Extra-Marital Affair Kalesh (Fight between husband, wife and lover at Patna Junction: Husband is in CRPF, wife is in Bihar Police, lady constable went to catch train with lover)
pic.twitter.com/am4h3RIoQP— Ghar Ke Kalesh (@gharkekalesh) October 31, 2024