CM Chandrababu: విశాఖపట్నంలో జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. నోవోటెల్ హోటల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 1200 మంది ఐటీ , ఎలక్ట్రానిక్స్ నిపుణులు పాల్గొంటున్నారు.
సదస్సు థీమ్‌గా సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ-గవర్నెన్స్ స్టాళ్లను సందర్శించి, వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి స్టాక్ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.
Also Read: Vijayawada Usthav: ‘విజయవాడ ఉత్సవ్’కి 100 కోట్లా?
ఈ 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొంటారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ దిల్లీ నుంచి మధ్యాహ్నం 1:55 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, రోడ్డు మార్గంలో నోవోటెల్ హోటల్‌కు వచ్చి 2:30 గంటలకు సదస్సులో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఆయన దిల్లీకి తిరిగి వెళతారు.
సీఎం చంద్రబాబు ఉదయం 11:45 గంటలకు కోస్ట్ బ్యాటరీ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11:50 గంటలకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అధికారులు ఈ సదస్సు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, పౌర సేవలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.