Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వంటగ్యాస్ పథకాన్ని జిల్లాలవారీగా ప్రారంభిస్తూ మహిళల మోములో చిరునవ్వును చిందిస్తున్నారు. ఆ పరంపరలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ మహిళ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఆ మహిళ ఇంటిలో స్వయంగా వంటగదికి వెళ్లి ఉచిత వంటగ్యాస్ పథకాన్ని ప్రారంభించారు. గ్యాస్ స్టవ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా టీ కాచి పెట్టారు. గిన్నెలో పాలు పోసి, టీ పొడి పోసి, చక్కెర వేసి టీ మరిగేంత వరకు ఆయనే స్వయంగా కాచిపెట్టారు. ఆ తర్వాత ఆ మహిళ చేతుల మీదుగా కప్పు, సాసర్‌లో టీ పోసి ఇవ్వగా, మంత్రి నాదేండ్ల మనోహర్‌తో కలిసి ముఖ్యమంత్రి టీని సేవించారు. దీంతో ఆ ఇంటి మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.