Cm chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తాం

Cm chandrababu: రాబోయే 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని అందజేస్తామని, అలాగే పేదలు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తే, వాటిని రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎమ్మెల్యేలకు తెలియజేసినట్లు, పలుచోట్ల వారు చొరవ తీసుకుని అర్హులకు పట్టాలు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో 633 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి పి.నారాయణ విన్నపం మేరకు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “రాఖీ పండుగ రోజు ఆడబిడ్డలకు ఇళ్లపట్టాలు అందించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ రోజు పట్టాలు పొందిన 633 మందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పేదలకు సహాయం చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. నెల్లూరులో అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి మహిళలకు పట్టాలిచ్చిన నారాయణకు అభినందనలు” అన్నారు.

అలాగే, పేదలను ఆదుకోవడంలో ‘సూపర్ సిక్స్’ సహా అన్ని సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, సూపర్ సిక్స్ ఇప్పటికే “సూపర్ హిట్” అయ్యిందని చెప్పారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి ‘వందనం’ ఇస్తున్నామని, ప్రభుత్వం అందించే పింఛన్లు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీవభ, అన్నా క్యాంటీన్లు వంటి పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.

అంతేకాక, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వల్ల ఆడబిడ్డలకు మరింత మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *