Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మహిళల కోసం చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ప్రకటించారు. ఏపీలో 70 శాతం మంది మహిళలు సిజేరియన్ చేపించుకుంటున్నారని అన్నారు.
ప్రధానమైన పథకాలు:
✔ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్: గర్భిణీలు, ప్రసూతి అనంతరం మహిళలు, శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
✔ ఎన్టీఆర్ బేబీ కిట్స్: కొత్తగా జన్మించిన శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన సామగ్రిని ఈ కిట్‌లో అందిస్తున్నారు.
✔ స్త్రీశక్తి రుణాలు: మహిళా వ్యాపారాలను, స్వయం సహాయ సంఘాల (డ్వాక్రా) అభివృద్ధికి తక్కువ వడ్డీ రుణాలను అందిస్తున్నారు.
డ్వాక్రా గ్రూపులకు పెద్దపీట
ప్రస్తుతం కోటి 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది వీరి అభివృద్ధికి 65 వేల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయనున్నారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యం
ప్రభుత్వం కేవలం రుణాలిచ్చి మాత్రమే ఆగకుండా, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఎడాదిలో లక్షమంది మహిళలు పారిశ్రామిక రంగంలో స్థిరపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడతాయనిభావిస్తున్నారు.