Artiste: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన సినిమా ‘ఆర్టిస్ట్’. ఈ సినిమాను జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి ‘చూస్తూ… చూస్తూ…’ అనే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సురేశ్ బొబ్బిలి స్వరపర్చిన ట్యూన్ కు రాంబాబు గోసాల క్యాచీ రిలిక్స్ రాశారు. కపిల్ కపిలన్ ఈ పాటను పాడారు. హీరోహీరోయిన్ల మధ్య హోలీ నేపథ్యంలో వచ్చే ఈ పాట కలర్ ఫుల్ గా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. అతి త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని అన్నారు.
