Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
“మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు. అయితే, ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది,” అని చిరంజీవి తెలిపారు. తమ కుటుంబ కులదైవమైన ఆంజనేయస్వామి ఆశీస్సులతో మార్క్ శంకర్ త్వరగా కోలుకుని మునుపటిలా ఆరోగ్యంగా మారుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
రేపు హనుమాన్ జయంతి సందర్భంగా, ఆ స్వామి తమ బిడ్డను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడని, తమ కుటుంబానికి అండగా నిలిచాడని చిరంజీవి భావోద్వేగంగా పేర్కొన్నారు.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని దేశమంతా ప్రజలు గ్రామాలు, పట్టణాల్లో ప్రార్థనలు చేస్తున్నారని, అందరి ప్రేమ, ఆత్మీయతకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. “మీరు అందరూ చూపుతున్న మద్దతుకు నా తరఫున, పవన్ కల్యాణ్ తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు,” అని చిరంజీవి పేర్కొన్నారు.

