Chirag Paswan: బిహార్ ఎన్నికల్లో N.D.A కూటమి…జయకేతనం ఎగురవేసింది. కూటమిలోని B.J.P, J.D.U పార్టీలకు ధీటుగా…కేంద్రమంత్రి చిరాగ్-పాసవాన్ నేతృత్వంలో లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ కూడా…అదిరే ప్రదర్శన చేసింది. గత ఎన్నికల్లోఒకే ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ…ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసి, 19 చోట్ల సత్తా చాటింది. ఇది సుమారు 68% స్ట్రైక్ రేట్‌ను సూచిస్తుంది. ఈ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్…కీలక భూమిక పోషించారు. ఒకప్పుడు తండ్రిని, తండ్రి నెలకొల్పిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్…వరుస ఎన్నికల్లో దుమ్ములేపి, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. 2020లో చిరాగ్ పాసవాన్, నితీష్ కుమార్‌పై విమర్శలు చేస్తూ పోటీ చేయడం వల్ల జేడీ(యూ) ఓట్లు చీలిపోయాయి. కానీ ఈసారి కూటమిలో స్థిరంగా ఉండటం వల్ల, ఓట్ల బదిలీ సజావుగా జరిగి జేడీ(యూ) బలం పెరగడానికి కూడా LJP(RV) పరోక్షంగా దోహదపడింది. ఈ ఎన్నికల విజయం చిరాగ్ పాసవాన్‌ను కేవలం తన తండ్రి వారసుడిగా కాకుండా, బీహార్ రాజకీయాల్లో స్వతంత్రంగా ఓట్లు సాధించగలిగే శక్తివంతమైన యువ నాయకుడిగా నిరూపించింది.

