China Manja: గాలిపటం ఎగురవేయాలి చిన్నా పెద్ద తేడా లేకుండా సాయంత్రం సమత్యంలో అనుకుంటాం. కానీ అలా ఎగురవేసే ..ఆ గాలిపటం ప్రాణాలను తీస్తుంది అని తెలుసా ? ఎక్కడో గాల్లో ఎగిరే గాలి పటం ఎలా అలా చంపేస్తుంది అంటారా ? ఇది చూసాక ఆమ్మో..గాలిపటం అంటారు. పక్కనోడి గాలిపటాన్ని తెంపేయాలి..నా గాలిపటమే ఎగరాలి అనుకోవడం పెద్ద తప్పు కాకపోవచ్చు , కానీ..ఆ గాలి పటానికి కట్టిన దారం తగిలి..మనిషే చనిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఉంది కదా పక్కనే ..ఓ దేశం ..అక్కడ నుంచి ఇక్కడకు వచ్చిన మాంజాలే …అసలు కారణం
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చిన్నా,పెద్ద తేడా లేకుండా గాలి పటాలను ఎగురవేస్తారు. ఈ క్రమంలో చాలా మంది ఇతర పతంగులను తెంపేయాలని చైనా మాంజా వినియోగిస్తున్నారు. ఈ దారంతో పక్షులకు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సింథటిక్ దారం, గాజు పిండితో పాటు అనేక రసాయనాలను ఉపయోగించి దారంను ఉపయోగిస్తారు. దీనిని పట్టుకుంటే తెగేంతా పదునుగా ఉంటుంది. తెగిపోయిన మాంజా రోడ్లపై పడటంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం.. చెట్లపై ఆ దారానికి చిక్కి ఎన్నో పక్షులు కూడా ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిత ట్రైబ్యునల్ చైనా మాంజాను నిషేదించింది. అయినా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు.
తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో చైనా మాంజా కలకలం రేపింది. ఖానాపూర్లోని విద్యానగర్ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ అనే వ్యక్తి రోజు చేపలు పట్టే వృత్తిలో భాగంగా చేపల వేటకు వెళ్లడానికి విద్యానగర్ నుంచి గోదావరికి బైక్ వెళ్తున్న సమయంలో పట్టణంలోని జూనియర్ కాలేజ్ దగ్గరకు రాగానే రోడ్డుపై పడినటువంటి చైనా మాంజా అకస్మాత్తుగా గొంతుకు తగలడంతో గొంతు కోసుకుపోయింది. గాయం కావడం వల్ల తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో అక్కడ ఉన్న స్థానికులు స్పందించి హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌కు తరలించారు.
దీంతో ప్రభుత్వం 2016లో చైనా మాంజాను నిషేదించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం.. చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా నేరంగా పరిగణిస్తారు. దీనిని ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.చైనా దారంతో కలిగే నష్టాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. చైనా మాంజాకు బదులుగా ఇతర దారం వినియోగించాలని సూచించాలి.

