China: భారత్, పాకిస్థాన్ దేశాల నడుమ నెలకొన్న ఉద్రిక్తతలపై ఇప్పటికే ఓ సారి స్పందించిన ఇరుదేశాల సరిహద్దు దేశమైన చైనా.. మరోసారి స్పందించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా శాంతియుత వాతావరణం నెలకొనేలా చొరవ తీసుకోవాలని గతంలో ఇరుదేశాలకు చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి సూచించారు. ఉగ్రవాదాన్ని తాము కూడా సహించేది లేదని పాక్‌కు కొంత హెచ్చరికను జారీ చేశారు. ఏదేశాన్నీ సమర్థించకపోయినా సంయమనం పాటించాలని తొలిదశలో సూచించారు.
China: ఇండియా, పాక్ నడుమ మరింత ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో మళ్లీ చైనా స్పందించింది. సమస్యను ఇరుదేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే తాను నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని చైనా ప్రకటించింది. తాజాగా జీ-7 దేశాలు కూడా స్పందించాయి. పాక్ చర్యలను తప్పుపడుతూ ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఇదే సమయంలో చైనా కూడా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
China: భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఉద్రిక్తతలు తీవ్రం కావడంపై చైనా ఆందోళనను వ్యక్తంచేసింది. స్థిరత్వం కోసం సంయమనం పాటించి, ఇరుదేశాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, ఇరుదేశాలు మధ్య శాంతి నెలకొనాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తుందని కోరారు. ఈ లక్ష్యం కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమేనని పేర్కొన్నది.