AP News

AP News: శ్రీసత్యసాయి జిల్లా జీజీహట్టి గ్రామంలో అతిసారం కలకలం

AP News: అక్కడ ఏదో జరుగుతుంది.. జరుగుతున్నా దానికి ఫలితం ప్రాణాలు పోతున్నాయి.. ఎవరు కూడా చంపడం లేదు.. కాని నెలకు ఒక్క ప్రాణం అయినా పోతుంది.. ఎలా.. ఎందుకు.. కారణాలు చెపితే ఇది నిజంగానే అసలు కారణమా అనే అంటారు.. కానీ వాస్తవం ఏంటంటే అది ఎవ్వరు చెప్పలేని నిజం.. కనిపెడితే వైద్యులు అయినా కనిపెట్టాలి.. లేదా తప్పు చేసిన వాడు అయినా తప్పుని ఒప్పుకుని వచ్చి చెప్పాలి.. అప్పటివరకు ఈ మరణహోమం ఆగేలా కనిపించటం లేదు..

శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం జీజీహట్టి గ్రామంలో అతిసారం కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం ఒక్కరితో ప్రారంభమైన అతిసార వ్యాధి 24 మందికి సోకగా.. ఓ చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన భాగ్యమ్మ, కెందన్న దంపతుల కుమారై అమూల్య అతిసారంతో బాధపడుతూ కర్ణాటక రాష్ట్రం శిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చెందింది.

ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో రొళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స చేయించారు. తిరిగి వ్యాధి బారిన పడిందని తల్లిదండ్రులు వాపోయారు. ఇదిలా ఉండగా ఇద్దరు రొళ్ల సామాజిక ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. మరో 22 మందికి వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి వెళ్లారు..

గ్రామంలో రెండు తాగునీటి బోర్డు ఉండగా ఒకటి చెడిపోయింది. దీంతో స్థానికులు వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నారు. గత వారం నాలుగు పెళ్లిళ్లు..గ్రామ దేవత ఉత్సవం నిర్వహించారు. ఆ సమయంలో కలుషితమైన ఆహారం తిన్నారా.. నీరు కలుషితమా.. అనేది వైద్యులు ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి రక్త నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు డీఎంహెచ్‌ఓ, ఆర్డీవో, అధికారులు తెలిపారు.

మడకశిర నియోజకర్గంలోని గుడిబండ, రొళ్ల మండలాల్లో గత ఏడాది ఆగష్టులో అతిసారం ప్రబలి ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాదీ ప్రబలడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రొళ్ల మండలం కాకీ గ్రామంలో గత ఏడాది మే నెలలో ఇద్దరు మృతి చెందగా.. 35 మందికి పైగా చికిత్స పొందారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AI Impact: ఏఐ వల్ల ఉద్యోగాలకు గుడ్‌బైనా? – బిల్ గేట్స్, ఒబామా హెచ్చరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *