Chhatisgarh: ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా భద్రతా బలగాలు చేపడుతున్న వరుస కూంబింగ్ ఆపరేషన్లు మావోయిస్టుల బలగాలకు గట్టి దెబ్బ కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని కంచల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా శోధన చర్యలు చేపట్టగా, ఒక భారీ సొరంగంలో మావోయిస్టులు దాచిన అత్యంత పెద్ద ఆయుధాల డంప్ బయటపడింది.
ఈ డంప్‌లో గ్రనైడ్ లాంచర్లు, గన్ పౌడర్, డిటోనేటర్లు, ఇన్వర్టర్లు, పేలుడు పదార్థాలు విపరీతంగా లభించాయి. అదేవిధంగా ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు, రైఫిల్ బయోనెట్‌లు, ఇనప రాడ్లు, కట్టర్లు కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి స్వాధీనం చేసిన ఆయుధాల డంప్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దది అని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులపై జరుగుతున్న వరుస కూంబింగ్‌లు, వారి భద్రతా వలయాన్ని దెబ్బతీస్తున్నాయని అధికారులు తెలిపారు.