Chhaava: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ‘పుష్ప2’ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. అనుకున్న డేట్ కంటే ఓ రోజు ముందుగానే వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా నుంచి విడుడలైన పాటలు, ట్రైలర్ తో స్కై లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ,బెంగాలీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలియచేశారు. బాలీవుడ్ బాబులు ఈ సినిమాకు పోటీగా ఏ సినిమానైనా విడుదల చేయటానికి జంకుతున్నారు. గతంలో డిసెంబర్ 6న విక్కీ కౌశల్ ‘ఛావా’ సినిమాను కూడా డిసెంటర్ 6న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Chhaava: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ ‘ఛావా’ తెరక్కుతోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీలో విక్కీ కౌశల్ తో పాటు అక్షయ్ ఖన్నా, రశ్మిక మందన్నా, దివ్యాదత్తా, అశుతోష్ రానా, ప్రదీప్ రావత్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘పుష్ప2’ డిసెంబర్ 5న వస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించగానే తాము చెప్పిన డిసెంబర్ 6వ తేదీన కాకుండా మరో తేదీకి రావాలని డిసైడ్ అయిందట ‘ఛావా’ టీమ్. బాలీవుడ్ బిగ్గీ అనిల్ తడాని ‘పుష్ప2’ని రిలీజ్ చేస్తుండటంతో పాటు ఆ సినిమాకు వచ్చిన భారీ బజ్ తో తమ సినిమా నలిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన టీమ్ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని డిసైడ్ అయిందట. మరి కొత్త తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.

