Stefanos Tsitsipas: స్టెపానోస్ సిట్సిపాస్…. ఈ పేరు వినగానే పౌలా బడోసా కూడా చప్పున స్ఫురిస్తుంది. ఎందుకంటే టెన్నిస్లో చెట్టపట్టాలేసుకుని తిరిగే ప్రేమపక్షుల్లో ఈ జంటదే అగ్రస్థానం. తాజాగా స్విస్ ఇండోర్స్ క్వార్టర్ ఫైనల్స్ ముగియగానే తళుక్కున మెరిసిందీ జంట. అయితే బడోసా వచ్చింది తన ఆత్మీయుని గెలుపు సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి కాదు…ఓడి బాధలో ఉన్న అతన్ని ఓదార్చడానికి.
Stefanos Tsitsipas: గ్రీక్ టెన్నిస్ హీరో సిట్సిపాస్ ఏటీపీ ఫైనల్స్ అవకాశాలను దెబ్బతిన్న నేపథ్యంలో అతనికి కాసింత ఊరట ఇచ్చేందుకు స్టేడియానికే వచ్చేసింది బడోసా. బసెల్ లో జరుగుతున్న ఈ టోర్నీలో సెంటర్ కోర్ట్ లో సిట్సిపాస్ ఆర్థర్ ఫిల్స్ ను ఎదుర్కొంటున్నాడు. ఏటీపీ టూర్ ఫైనల్స్ కు చేరాలంటే ఈ టైటిల్ గెలవడం సిట్సిపాస్ కు కీలకం. కానీ అనూహ్యంగా ఫిల్స్ చేతిలో ఓడాడు సిట్సిపాస్. మ్యాచ్ ముగియగానే బడోసా కోర్టు వద్దకే వచ్చి ఓ క్యూట్ పిక్చర్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సిట్సిపాస్ ఎప్పటికీ ఓ ఛాంపియనే అంటూ కితాబిచ్చి ఊరటనిచ్చింది.
Stefanos Tsitsipas: ఇటీవలే ఈ జోడీ మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మైదానం బయటే కాదు ఆన్ కోర్ట్ కూడా తాము బెస్ట్ కపుల్ అని చెప్పుకోడానికి తెగ తాపప్రయపడుతోంది బడోసా. 2024 యుఎస్ ఓపెన్లో బడోసా మూడో రౌండ్ నెగ్గగానే బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది పౌలా. ఆన్ కోర్ట్ మెరుపులకు మేమిద్దరం సిద్ధమంటూ ప్రకటించింది. అయితే ఆమె కోరిక నెరవేరలేదు. తొలి రౌండ్లోనే ఈ జోడీ ఓడిపోయింది. డెబ్యూలోనే 2019లో వాల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన సిట్సిపాస్ తర్వాత నిలకడగానే ఆడాడు. ఇప్పటిదాకా అన్ని ఫైనల్స్ లోనూ ఆడాడు. ఈ ఏడాది అవకాశాలు మాత్రం మిణుకుమిణుకుమంటున్నాయి. ఈ తరుణంలో బడోసా ఓదార్పే సిట్సిపాస్ కు దిక్కు, కిక్కు అంటున్నారు టెన్నిస్ లవర్స్.